ఘనంగా దాదాన్ గారి సందీప్ రావు జన్మదిన వేడుకలు
పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన సందీప్ రావు
మనోరంజని, తెలుగు టైమ్స్ ప్రతినిధి – హైదరాబాద్
ప్రముఖ రాజకీయ నాయకుడు దాదాన్ గారి సందీప్ రావు తన జన్మదినాన్ని బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కాలనీలో మొక్కలు నాటారు.
మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ హరిత కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, సందీప్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి పలు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా సందీప్ రావు మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి దాన్ని పుస్తేలా కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత,” అని అన్నారు.