కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంపు

Alt Name: DA Hike Announcement for Central Employees

హైదరాబాద్: అక్టోబర్ 16
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ మంచి వార్త అందించేందుకు సిద్ధమైంది. డియారెనెస్ అలవెన్స్ (DA)లో మూడు శాతం పెంపు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిందని సమాచారం. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది.

ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని జాతీయ మీడియా ద్వారా కథనాలు వెలువడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ పెంపునకు సంబంధించిన చర్చ జరిగింది.

ఈ రోజు సాయంత్రం లోగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిర్ణయంతో లక్షల మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షన్ దారులకు లబ్ధి చేకూరనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment