🚨 పోలీసు శాఖలో క్రిప్టో దందా కలకలం
మనోరంజని తెలుగు టైమ్స్ – హైదరాబాద్ నవంబర్ 26
పోలీసు శాఖలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. కోట్లు లాభాలు వస్తాయని నమ్మబలికి దాదాపు 100 మంది పోలీసు సిబ్బందినే పెట్టుబడి పెట్టించినట్లు తెలుస్తోంది. ఈ దందాకు లోవరాజు అనే పోలీసు కానిస్టేబుల్‌నే మూలకర్తగా గుర్తించినట్టు ప్రాథమిక సమాచారం. రూ. 3 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.50 వేల లాభం వస్తుందని చెప్పి పలువురిని బురిడీ కొట్టించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినప్పటికీ ఘటన పై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ ప్రారంభించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.