నిర్మల్, 15 July
నిర్మల్ పట్టణంలో దారుణ హత్య కలకలం రేపింది. వైఎస్సార్ కాలనీ సమీపంలో ఆటో డ్రైవర్ అస్లాం (23)పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిర్మల్ పట్టణంలో దారుణ హత్య కలకలం రేపింది. వైఎస్సార్ కాలనీ సమీపంలో ఆటో డ్రైవర్ అస్లాం (23)పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
బాధితుడు అస్లాం వైఎస్సార్ కాలనీ వద్ద ఉన్న సమయంలో, ముసుగులు ధరించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అస్లాంను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.
దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చి, దాడికి ముందు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతోనే అస్లాంపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లో తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.


