నిజామాబాద్, 2026-07-18
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మూడు వారాల వ్యవధిలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 559 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 31 మందికి జైలు శిక్ష పడగా, మిగిలిన వారికి రూ. 52.8 లక్షల జరిమానా విధించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన మూడు వారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో 559 మంది పట్టుబడ్డారు. వీరిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టులలో హాజరుపరచగా, 31 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి రూ. 52,80,000/- జరిమానా విధించారు.
కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో అధిక మొత్తంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడటం జరుగుతోందని జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జూన్ 29, 2026 నుండి జులై 17, 2026 వరకు నిర్వహించిన తనిఖీలలో మొత్తం 559 కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు.











