నిజామాబాద్, 2026-07-17
నాాబాపోీసనేటపధోయసేవచవాహనానడపేవాపపోీసఠనచయచేపడతననా.గతూడవాాో559డఅడడవేసనోాగాగనవాూ.52.80ానావధచా.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. గత మూడు వారాల వ్యవధిలో కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 559 కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
తేదీ 29-06-2026 నుంచి 17-07-2026 వరకు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 31 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి కలిపి రూ.52.80 లక్షల జరిమానా విధించబడిందని పేర్కొన్నారు.
అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడిపే ఘటనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు చట్టాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.











