రాజన్న సిరిసిల్ల, 2026-08-08
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిధిలోని మిడ్ మానేరు కొదురుపాక వంతెన సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 8 మనో రంజని తెలుగు టైమ్స్
బోయినపల్లి మండల పరిధిలోని మిడ్ మానేరు కొదురుపాక వంతెన సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని, చొక్కా, ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల విజ్ఞప్తి
మృతుడి వివరాలు, ఆచూకీ తెలిసిన బంధువులు లేదా ఇతరులు ఎవరైనా ఉంటే వెంటనే బోయినపల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు రెండు ఫోన్ నంబర్లను (8712656418, 8712537532) అందుబాటులో ఉంచారు. మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని బోయినపల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు.












