సోనాపేట్ గ్రామానికి చెందిన మహిళ మెడలో నుండి రెండు తులాల బంగారు గొలుసులను దొంగలు అపహరించిన సంఘటన మెండోరా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉప్పరి గణపతి తన భార్య గంగుతో కలిసి గ్రామానికి వస్తుండగా, మార్గమధ్యంలో యూటర్న్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ అపహరణకు పాల్పడ్డారు.
దుండగులు గంగు మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని, అక్కడి నుంచి పరారయ్యారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెండోరా ఎస్సై సుహాసిని ఈ ఘటనపై మాట్లాడుతూ, దుండగులు వేగంగా తప్పించుకున్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు.
పోలీసులు సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని ఎస్సై విశ్వాసం వ్యక్తం చేశారు.












