మహబూబ్‌నగర్, 30 June
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయపల్లిలో దారుణ హత్య చోటుచేసుకుంది. భార్య కవిత, తన భర్త నాగేశ్‌ను చీరతో చేతులు కట్టేసి, కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసి చంపింది. భార్య వివాహేతర సంబంధం, తరచూ గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య కవిత తన భర్త నాగేశ్‌ను చీరతో చేతులు కట్టేసి, కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసింది. భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, పలుమార్లు మందలించినా మార్పు లేకపోవడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. పంచాయితీలు జరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు.
బుధవారం రాత్రి పిల్లలు నిద్రిస్తున్న వేళ, భర్త నాగేశ్ చేతులను చీరతో కట్టేసి, కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసింది. చిన్న కుమారుడు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే నాగేశ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు భార్య కవితపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












