పోక్సో కేసులో కొరియోగ్రాఫర్ బాలకృష్ణ అరెస్ట్*

*పోక్సో కేసులో కొరియోగ్రాఫర్ బాలకృష్ణ అరెస్ట్*

బాలికపై లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఢీ షో డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ బాలకృష్ణ మాస్టర్‌పై గచ్చిబౌలి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

కుబుంబ కలహాలతో మొదటి భర్తతో విడిపోయిన ఓ మహిళను బాలకృష్ణ గతేడాది జులై 7న రెండో వివాహం చేసుకున్నాడు. సదరు మహిళకు 10వ తరగతి చదువుతున్న కుమార్తె (14) ఉంది. ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

కొంతకాలంగా బాలకృష్ణ మాస్టర్ తన మైనర్ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో సదరు మహిళ జులై 9న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదు కాగానే నిందితుడు పరారయ్యాడు. దీంతో అతని కోసం గాలించిన పోలీసులు.. బెంగళూరులోని తన అన్న వద్దకు వెళ్లాడని తెలుసుకొని, అతన్ని అరెస్ట్ చేసి కంది జైలుకు తరలించారు. కాగా, గతంలో పలువురు యువతులు, మహిళలను బాలకృష్ణ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి…

Join WhatsApp

Join Now

Leave a Comment