M4News – డోర్నకల్ నియోజకవర్గం
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణలో వివాదం
డోర్నకల్ నియోజకవర్గంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు, కుల సంఘాల అసంతృప్తి వెల్లువెత్తాయి.
ఈ కార్యక్రమంలో బలరాం నాయక్, డా. మురళి నాయక్, డా. రామచంద్రు నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ ఎంపీ ఒద్దిరాజ్ రవి చంద్ర పటేల్ (గాయత్రి రవి) పాల్గొన్నారు. అయితే, గౌడ్ వర్గానికి చెందిన పలువురు ప్రముఖ నేతలు, కుటుంబాలు గైర్హాజరైన విషయం చర్చనీయాంశమైంది.
స్థానిక గౌడ్ నేతలు ఆరోపిస్తూ – “సేవాలాల్ మహారాజ్ కార్యక్రమాలకు మమ్మల్ని పిలవని నాయకులు, ఇప్పుడు గిరిజన ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరణ చేయడం ద్వంద్వ వైఖరి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమం నిర్వహణపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. “ఆర్భాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. సమన్వయం లోపంతో కార్యక్రమం ప్లాప్ అయ్యింది” అని పలువురు గౌడ్ పెద్దలు వ్యాఖ్యానించారు.
ఇకపోతే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, స్థానిక గౌడ్ పెద్దలు, ప్రొఫెషనల్ గౌడ్స్, గండు ఐలయ్య కుటుంబం, గండు మల్లి కార్జున్ కుటుంబం, పెరుమాండ్ల జగన్నాధం కుటుంబాలు ఆహ్వానం పొందకపోవడం గౌడ్ వర్గంలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
చందాలు సమకూర్చిన గౌడ్ పెద్దలే కార్యక్రమం పద్ధతిపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు దీనిని “కాంగ్రెస్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికే బీఆర్ఎస్ నేతల ఎత్తుగడగా కనిపించింది, అందుకే మీటింగ్ ప్లాప్ అయ్యింది” అని వ్యాఖ్యానించారు.
✍️ డి. వై. గిరి
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్
డోర్నకల్ నియోజకవర్గం