ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి* — అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి* — అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ ప్రతినిధి అక్టోబర్ 16

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి* — అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,
నిర్మాణ అనుమతులు లభించిన ఇండ్ల పనులు ఆలస్యం కాకుండా దశలవారీగా పూర్తి చేయాలని సూచించారు. మార్క్ అవుట్, బేస్‌మెంట్ తదితర దశల్లో పూర్తయిన ఇండ్ల వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా ఇప్పటికే పూర్తి అయిన, కొనసాగుతున్న ఇండ్ల పనుల పురోగతిని సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పనులు వేగవంతం చేయాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనచో మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాలు కల్పించేలా చూడాలని అన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమయానికి విధులకు హాజరు కావాలని, నిర్లక్ష్యం చూపినవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఈజీఎస్ నిధుల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టిన చోట వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ప్రారంభం కాని పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగ్, విద్యా, పంచాయతీ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment