మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
ముంబైలో ఓ కానిస్టేబుల్ సూచన మహిళ ప్రాణాలు కాపాడింది. గోరేగావ్‌కు చెందిన గౌతమ్ రోహ్రా, ఆయన సతీమణితో కలిసి ఇంటికి బయలుదేరారు. రోహ్రా సీటు బెల్ట్ వేసుకోగా, ఆయన భార్య సీటు బెల్త్ వేసుకోలేదు. బాంద్రా ఈస్ట్‌లోని కాలానగర్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించాడు. ఆమెకు సీటు బెల్ట్ వేసుకోవాలని, లేదంటే రూ.1000 ఫైన్ పడుతుందని చెప్పాడు. ఆమె వేసుకుని కొంత దూరం వెళ్లాక కారు రెండు పల్టీలు కొట్టింది. ఆమెకు గాయాలు కాలేదు.