భైంసా గణనాథుడు నిమజ్జన శోభాయాత్రలో కాంగ్రెస్ యువనేత నృత్యాలు
మనోరంజని ప్రతినిధి, భైంసా | సెప్టెంబర్ 04
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గురువారం గణనాథుడు నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాంజరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువనేత కదం నాగేందర్ పటేల్ స్నేహితులతో కలిసి నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.
ఆయన నృత్యాలు శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానికులు, భక్తులు హర్షాతిరేకాలతో అభినందించారు.
ఈ సందర్భంగా నాగేందర్ పటేల్ మాట్లాడుతూ, “జై బోలో గణనాథుడు… నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.