కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి
న్యూస్ ఫిబ్రవరి 23 కుబీర్; పట్టభద్రులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కుబీర్ మాజీ సర్పంచ్ మీరా విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కుబీర్ మండలంలో నరేందర్ రెడ్డి కి మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని పట్టభద్రుల సమస్యను పరిష్కరించడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు.వివిధ గ్రామాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ముదోల్ తాలూకా మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి ఆదేశానుసారంగా కుబీర్ మండలంలో వివిధ గ్రామాల పట్టభద్రులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ కందూరు సంతోష్ నాయకులు సాయినాథ్ , ఆల్ ఫోర్స్ బీమ్ రావు,అన్వర్ ,మహేష్ ,శ్రీనివాస్ వెంకటేష్ తదితరులు ఉన్నారు .