ఉత్తమ అవార్డు గ్రహీతలకు కాంగ్రెస్ నాయకుల సన్మానం
ముధోల్ మనోరంజిని ప్రతినిధి ఆగస్టు 21
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య -జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్- జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేతుల మీదుగా ముధోల్ సీఐ జి. మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సీస్, పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ముధోల్లోని సర్కిల్ కార్యాలయంలో సిఐ జి. మల్లేష్, ఎస్సై బిట్ల పెర్సీస్, గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ ను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి, ఆత్మ డైరెక్టర్ కిషన్ పతంగి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషన్ పటేల్, అజీజ్, దిగంబర్, ఖాలిద్ పటేల్, జమీల్, పల్లె నగేష్, అయ్యాజ్ భాయ్, ఎస్.కె నజీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు