స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కృషి చేయాలి.
-జిల్లా ఇన్చార్జి రామ్ భూపాల్ ,
-టిపిసిసి కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్.
మనోరంజని ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్ 02
నిర్మల్ జిల్,సారంగాపూర్: అందరు కలసి కట్టుగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కు కృషి చేయాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రామ్ భూపాల్ , టిపిసిసి కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ లు అన్నారు మంగళవారం సారంగాపూర్ మండలకేంద్రంలో ని మార్కెట్ యార్డు లో కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్త సమావేశం నిర్వహించారు.ముందుగా.. బీసీలకు 42 శాతం
రిజర్వేషన్ అమలు చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం అందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క ,రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం వారు మాట్లాడారు.. బిసి రిజర్వేషన్ చారిత్రాత్మక ఘనత కాంగ్రెస్కే దక్కిందని పేర్కొన్నారు.దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళ్ళు అర్పించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లో జి నర్సయ్య,మార్కెట్ ఛైర్మెన్ అబ్ధుల్ ఆధి,కిసాన్ సెల్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ పోత రెడ్డి,సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి,నవీన్ రెడ్డి,భూమా రెడ్డి,సత్య పాల్ రెడ్డి,భీమన్న,చిన్నయ్య,పోతన్న,గంగాధర్,గణేష్, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు