కౌట్ల బి గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి కాసారం దీపక్

కౌట్ల బి గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి కాసారం దీపక్

మనోరంజని తెలుగు టైమ్స్, సారంగాపూర్ – డిసెంబర్ 05

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల బి గ్రామపంచాయతీకి ఈసారి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కేటాయించడంతో, గ్రామానికి చెందిన కాసారం దీపక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. యువ నాయకుడిగా రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తూ, గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పరుచుకున్న దీపక్‌కు గ్రామస్థాయిలో మంచి ప్రజాదరణ ఉంది. గ్రామ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, సేవాభావంతో పనిచేయడం తనకు బలం అని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌గా ఎన్నికైతే గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని, పారదర్శక పాలనకు కట్టుబడి ఉంటానని దీపక్ స్పష్టం చేశారు. గ్రామంలో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment