బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్–బీజేపీలు కుమ్మకయ్యాయి: దాదన్న గారి విఠల్ రావు

బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్–బీజేపీలు కుమ్మకయ్యాయి: దాదన్న గారి విఠల్ రావు

స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటిదని మండిపాటు

మనోరంజని, తెలుగు టైమ్స్ ప్రతినిధి – హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించిన వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాలనకు చెంప పెట్టు లాంటిదని విమర్శించారు.

విధివిధాలుగా బీసీ రిజర్వేషన్పై హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, నేడు జీవో 9 ద్వారా బీసీలను మోసం చేశారని ఆయన ఆరోపించారు.

“పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టిచినట్లు కాంగ్రెస్ ప్రవర్తించింది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ – గవర్నర్ – రాష్ట్రపతి – పార్లమెంట్ చట్టం అనే ప్రక్రియను పాటించకుండా మోసపూరిత జీవో తీసుకురావడం తగదు,” అని విఠల్ రావు తెలిపారు.

అంతేకాదు, బీసీ హక్కుల అంశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీసీ వర్గాలను దారి తప్పిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, ఆ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు.

“ఇది బీఆర్ఎస్ పార్టీకి బీసీ బిడ్డలపై ఉన్న ప్రేమను సూచిస్తుంది. కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కుమ్మకై బీసీ హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలని మా డిమాండ్,” అని విఠల్ రావు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment