జొన్నాడలో చైర్మన్లు, డైరెక్టర్లకు అభినందన సత్కారం.
ఆలమూరు:-
మండలంలోని జొన్నాడ ఎస్సీ కాలనీలో పలువురు చైర్మన్లుకు, డైరెక్టర్లకు మంగళవారం స్థానిక ఎఫ్ఎల్సిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. ఇందులో స్థానిక సొసైటీ చైర్మన్ మేడపాటి రామారెడ్డి, శివాలయం ట్రస్ట్ చైర్మన్ దమ్ము సత్యనారాయణ, ఏఎంసీ డైరెక్టర్లు నామాల సూరిబాబు, చింతలపూడి శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్లు రేలంగి కొండయ్య, యాళ్ళ చంద్రశేఖర్ లకు పెద్ద ఎత్తున ఎస్సీ నాయకులు హాజరై పూలమాలలు వేసి దుస్సాలువాలు కప్పి అభినందించి సన్మానించారు. అలాగే రైతుల అభ్యున్నతికి ఆలయాల పటిష్టతకు ఆయా చైర్మన్లు, డైరెక్టర్లు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్లు, డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటామని అన్నారు. అలాగే మాకు ఈ పదవులు రావడానికి విశేషమైన కృషి చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు వారంతా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తాడి శ్రీనివాసరెడ్డి(బట్టి శ్రీను), గొడవర్తి దుర్గాప్రసాద్(బాబి), అయినవిల్లి సత్తిబాబు గౌడ్, భావన శ్రీనివాస్, మల్లిడి సూర్యనారాయణ రెడ్డి,ఎఫ్ఎల్సిఎస్ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు