తెలుగు ఫిలిం ఛాంబర్లో ఘర్షణ
తెలుగు ఫిలిం ఛాంబర్లో ఘర్షణాయుత వాతావరణం నెలకొంది. ఆంధ్రా గో బ్యాక్ అంటూ తెలంగాణ వాదులు నినాదాలు చేశారు. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని, సి. నారాయణరెడ్డి ఫోటో ఎందుకు లేదని తెలంగాణ వాదులు గొడవకు దిగారు.
నిర్మాతల మండలి ఛాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్నకుమార్తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది