ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేత
మనోరంజని ప్రతినిధి ముధోల్ జులై07
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బ్రాహ్మణగాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రాజుల రాధిక రఘునాథ్ రూ 25 వేల విలువగల కంప్యూటర్ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు కంప్యూటర్ను అందజేసిన దాతకు గ్రామ అభివృద్ధి కమిటీతో పాటు ఉపాధ్యాయులు సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమవంతు బాధ్యతగా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడంలో భాగంగా దాతలు ముందుకు వచ్చి కంప్యూటర్ను అందజేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి. భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు మల్లారెడ్డి, మారుతి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు