సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇంటి జాబితా తయారి

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇంటి జాబితా తయారి

ఎమ్4 ప్రతినిధి ముధోల్

మండల కేంద్రమైన ముధోల్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఇంటి జాబిత తయారు చేయడంలో భాగంగా ఎంపీడీవో శివకుమార్ స్టిక్కర్లను అంటించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఈనెల 6 నుండి సమగ్ర కుటుంబ సర్వే ను ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఏర్పాట్లలో భాగంగా ఇంటి జాబితాను తయారు చేయడంతో పాటు ఇంటికి స్టికరింగ్ వేస్తున్నారు. జాబితాను అందించిన తర్వాత ఎన్యుమరేటర్ లు ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సర్వే ను చేపట్టనున్నారు. ఎన్యుమరేటర్ లకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాన్ని సహితం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని వెల్లడించారు. కుటుంబ వివరాలను సక్రమంగా అందించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రసాద్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ అనూష, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment