ఊర పండుగకు పరిశుభ్రత, ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్ జిల్లా జులై
నగరంలో జరుగుతున్న ఊర పండుగను పురస్కరించుకొని నగరపాలక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమిషనర్ ప్రదీప్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఖిల్లా చౌరస్తా అమ్మవారి గద్దె నుంచి గాజుల్‌పేట, పెద్దబజార్, గోల్ హనుమాన్, వినాయక్‌నగర్, దుబ్బా తదితర ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు నిర్వహించాం అని అసిస్టెంట్ ఇంజనీర్ భూమేష్ తెలిపారు.
అమ్మవారి ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వీలైనన్ని ఏర్పాట్లు చేశామని, ఊరేగింపు మార్గంలో ఉన్న గుంతలు పూడ్చి మరమ్మతులు పూర్తిచేశామని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో పరిశుభ్రత చర్యలు, శుభ్రత పనుల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
భక్తులు, ప్రజలు సౌకర్యంగా ఊరేగింపు కార్యక్రమాల్లో పాల్గొనాలన్నదే తమ లక్ష్యమని భూమేష్ తెలిపారు.