ముగిసిన ఎన్ పి ఎల్
లీగ్- క్రికెట్ పోటీలు
సారంగాపూర్ జనవరి 04 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్ :మండలంలోని జామ్ గ్రామంలో నాగపూర్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జామ్ మైదానంలో నాల్గు రోజులుగా క్రికెట్ సందడి నెలకొంది. 8 జట్ల క్రీడాకారులు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డారు. సాయంత్రం జరిగిన ముగింపు వేడుకలకు సేవలాల్ సేన జిల్లా అద్యక్షులు పవార్ రాజేష్ హాజరై విజేత గా నిలిచిన మహావీర్ తండా జట్టు ,రన్నరప్ గా రవీంద్రనగర్ జట్టు నిలిచింది వారికి ట్రోఫీలు, నగదు ప్రోత్సాహం, వ్యక్తిగత మెడల్స్ అందించారు.
ఈ కార్యక్రంలో పవార్ ఉత్తమ్ ,నాగపూర్ ఉప సర్పంచ్ లాల్ సింగ్,క్రీడాకారులు పాల్గొన్నారు.