ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ అభిలాష

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం – నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ

🔹 ఫిబ్రవరి 27న ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్

🔹 జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు – 19,107 ఓటర్లు

🔹 లైవ్ వెబ్‌కాస్టింగ్, చెక్‌పోస్టులు ఏర్పాటు – పటిష్ట భద్రత

🔹 38.06 లక్షల నగదు, 827 లీటర్ల మద్యం, నిషేధిత పదార్థాలు స్వాధీనం

ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం – నిర్మల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, 46 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో 19,107 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. ఓటరు అవగాహన కోసం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 38.06 లక్షల రూపాయల నగదు, 827 లీటర్ల మద్యం, నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

 

నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, మొత్తం 19,107 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. వీరిలో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ కొనసాగుతోందని, త్వరగా పూర్తవుతుందని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 38.06 లక్షల రూపాయల నగదు, 827 లీటర్ల మద్యం, 5,750 రూపాయల విలువ గల నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస్, రాజకీయ నాయకులు శ్రవణ్ రెడ్డి, సిరికొండ రమేష్, గండ్రత్ రమేష్, హైదర్, మజార్, జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment