నిర్మల్ జిల్లా కుంటాల మండలం వెంకూరు గ్రామ పంచాయతిలో గంజాయి తదితర మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, సాగు, రవాణా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
యువత మంచి మార్గంలో నడుచుకుని తల్లిదండ్రులకు, సమాజానికి గౌరవం తీసుకురావాలని సీఐ సూచించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై గ్రామ ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో కుంటాల ఎస్సై అశోక్, గ్రామ పంచాయతి పాలకవర్గ సభ్యులు, సిందే బాజీరావు పటేల్, మగ్గిడి డిగంబర్, బారాస కన్వీనర్ పడకంటి దత్తు, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు.








