భైంసా పట్టణంలో అగ్నివీర్ నియామకాల్లో ఎంపికైన యువకులకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ శాసనసభ్యుడు గడ్డిగారి విఠల్ రెడ్డి పాల్గొని యువకులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, యువత దేశ సేవలో కీలక పాత్ర పోషించాలని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
అకాష్, కార్తీక్, వంశీ, మణికంఠ మరియు రోహన్ అనే యువకులు అగ్నివీర్ ఉద్యోగాలను సాధించారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐక్యత సేవా సమితి అధ్యక్షుడు యోగేష్ యువకులకు శిక్షణ అందించినందుకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ తోట రాము, సూర్యనారాయణ మరియు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.












