తానూర్, 2026-08-31
తానూర్ మండలంలోని తొండాల గ్రామంలో డా. అన్నాభావు సాటే 106వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మెరేకర్ మాధవ్ అన్నాభావు సాటే చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు డా. అన్నాభావు సాటే సమాజానికి చేసిన సేవలను, ఆయన కృషిని స్మరించుకున్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడంలో డా. అన్నాభావు సాటే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తానూర్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, హోరే శివరామ, రాజు రెడ్డి, లోఖండే సచిన్, హోరే గణేష్, సకేవాడ్ సాయినాథ్, లోఖండే గంగాధర్, లోఖండే సుభాష్, నిదాన్కర్ లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.