ప్రొద్దుటూరు పట్టణంలో ఎండ తీవ్రతకు గురై మరణించిన రుక్మిణమ్మ అనే వృద్ధురాలికి 'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' సభ్యులు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఫౌండేషన్ను సంప్రదించారు.
స్థానికంగా రాజీవ్ సర్కిల్ వద్ద రుక్మిణమ్మ అనే వృద్ధురాలు తీవ్రమైన ఎండ కారణంగా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.
వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, పోలీసులు 'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు, హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఒంటరిగా ఉన్నవారికి కూడా గౌరవప్రదమైన అంత్యక్రియలు జరగాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 9182244150 నంబర్లను సంప్రదించవచ్చు.












