ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని టిఎన్జీవో భవనంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు, సంఘాల నాయకులు, సిబ్బంది హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.
ఆదివాసీల హక్కులు, సమస్యలపై చర్చ
ఈ సందర్భంగా పలువురు అధికారులు, సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, అస్తిత్వం, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఆదివాసీ యువత విద్య, ఉపాధి, విభిన్న రంగాల్లో ముందుకు సాగేందుకు తగిన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో డిటిడిఓ నిహారిక, నిర్మల్ గ్రామీణ మండల తహసిల్దార్ ప్రభాకర్, నాయకులు మంద మల్లేష్, నైతం భీమ్ రావు, తొడసం శంభు, తొడసం గోవర్ధన్, ముసలి చిన్నయ్య, సాకి లక్ష్మణ్, సంచు శ్రీనివాస్, పెంధొర్ మాధవ్ రావు, పి. శంకర్, సంఘపు నరసయ్య, ఈశ్వర్, సురేశ్, వివిధ సంఘాల నాయకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.












