బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
బోథ్ మండల కేంద్రంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ పాల్గొని, ఆదివాసీ గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తామని, ఆదివాసీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
బోథ్ మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని భగత్ సింగ్ చౌక్ నుండి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ డోలు వాయిద్యాలతో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీగా తరలివచ్చి కొమురం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభ నిర్వహించారు.
మౌలిక వసతుల కల్పన హామీ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ మాట్లాడుతూ, ఆదివాసీ గ్రామాలకు విడతల వారీగా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బోథ్ మండలంలో ఆదివాసీ భవనం నిర్మించుటకు నిధులు మంజూరు చేస్తానని అన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో సర్మేడులు ఆడేం భీంరావ్, గంగారాం, బోథ్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, ఉద్యోగ సంఘం నాయకులు తొడసం భూమన్న, న్యాయవాది పంద్రం శంకర్, కరత్వాడ సర్పంచ్ దుర్వ విశ్వశ్వర్, పట్నాపూర్ సర్పంచ్ పంద్రం సుగుణ, సర్పంచులు పెందోర్ పృథ్వీ, మాడవి దేవురావు, పిప్పల్దారి మెస్రం అనసూయ, కిస్టు, ఆత్రం కేశవ్, కుంరం లక్ష్మిన్, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, మాజీ ఎంపీటీసీ రామేల్లి భోజన్న, కుర్మే రాజన్న, కనక అమృత్ రావు, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి, పసుల చంటి, వివిధ గ్రామాల పటేల్లు, దేవరీలు, మహిళలు పాల్గొన్నారు.












