నిర్మల్, July 10
జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ ఫిషరీస్ కార్యాలయంలో ఎఫ్.డి.ఓ. విజయ్ కిరన్కర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా మత్స్యకార సంఘాల ప్రతినిధులు, గంగపుత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ ఫిషరీస్ కార్యాలయంలో ఎఫ్.డి.ఓ. విజయ్ కిరన్కర్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మత్స్యకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, గంగపుత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫిషరీస్ అధికారి కిరణ్ కుమార్, గౌసోద్దీన్ తో పాటు నిర్మల్ నాలుగు సంఘాల పెద్దలు రాధాకృష్ణ శెట్టి, కృష్ణ, పోశెట్టి, దేవేందర్, సాయిచరణ్, శ్రీను, మహేందర్, అడెళ్లు, నారాయణ, బీమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్.డి.ఓ. విజయ్ కిరన్కర్ కేక్ కట్ చేసి మత్స్యకారులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.












