హైదరాబాద్, 2026-08-21
బీసీ వర్గాల సాధికారత, రాజ్యాధికార సాధన కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప బీసీ ఉద్యమకారుడు, కుమ్మర కుల ఐక్యతావాది స్వర్గీయ మొగిలిచర్ల వీరన్న ఆరో వర్ధంతిని హైదరాబాద్లోని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మర సామాజిక వర్గ సాధికారతరాజ్యాధికారంలో కుమ్మర కులస్తుల పాత్ర అనే అంశంపై సదస్సు జరిగింది.
బీసీ వర్గాల సాధికారత, రాజ్యాధికార సాధన కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప బీసీ ఉద్యమకారుడు, కుమ్మర కుల ఐక్యతావాది స్వర్గీయ మొగిలిచర్ల వీరన్న అని తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ న్యాయ సలహాదారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది మలికంటి వెంకన్న అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల వీరన్న ఆరో వర్ధంతి వేడుకలను రాష్ట్ర అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మర సామాజిక వర్గ సాధికారతరాజ్యాధికారంలో కుమ్మర కులస్తుల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
కుమ్మర్ల సంక్షేమమే లక్ష్యంగా వీరన్న కృషి
నేదునూరి కనకయ్య మాట్లాడుతూ.. కుమ్మర్ల ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వీరన్న, స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా కుమ్మర కుల వృత్తిదారుల ఆర్థిక అభివృద్ధి కోసం సబ్సిడీ రుణాలు, కుమ్మర శాలివాహన ఫెడరేషన్ సాధనకు కృషి చేశారని తెలిపారు. కుమ్మరుల హక్కుల రక్షణ కోసం ఆయన చేసిన పోరాటాలు, రాష్ట్రవ్యాప్త చైతన్య యాత్రల ద్వారా సామాజిక వర్గంలో ఐక్యత, చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు.
బీసీ, బహుజన వర్గాల న్యాయం కోసం పోరాటం
తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కుమ్మర ఆత్మగౌరవ భవన్ ఉపాధ్యక్షుడు కొల్లూరు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ, బహుజన వర్గాల సామాజిక న్యాయం కోసం వీరన్న ఉద్యమించారని గుర్తుచేశారు. కుమ్మర కుంటల జీవో అమలు కోసం, కుంటలు కబ్జాలకు గురైనప్పుడు నిరాహార దీక్ష చేపట్టి కుమ్మరులకు మట్టి లభించే కుంటలపై హక్కులను రక్షించేందుకు పోరాడారని తెలిపారు. వీరన్న భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాల సాధన కోసం కుమ్మర సమాజం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఆశయాల సాధనే నిజమైన నివాళి
వీరన్న ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. అనంతరం వీరన్నకు నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. బీసీ ఉద్యమకారులు, కుమ్మర సంఘ నాయకులు రాజ్యాధికార సాధనకు సంసిద్ధం కావాలని ప్రతిజ్ఞ చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శులు మలికంటి సిద్ధయ్య, ధరినిధర్, శ్యాంసుందర్, నమిలకొండ ప్రభాకర్, నాంపల్లి శంకర్, మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ వారసవేని పరశురామ్, ఉద్యోగుల విభాగం కన్వీనర్ ఎం. కుమార్, యువత విభాగం నాయకులు కాళ్లారం కృష్ణ, ఉపాధ్యక్షుడు కాళ్లారం శంకర్ తదితరులు పాల్గొని మొగిలిచర్ల వీరన్నకు ఘన నివాళులు అర్పించారు.












