మిర్యాలగూడ, 2026-08-31
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సుమారు 17 ఫిర్యాదులు అందాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆర్డిఓ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆర్డిఓ ఎస్.రమణారెడ్డి అధ్యక్షతన డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 17 ఫిర్యాదులు అందాయి. వీటిలో మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కార్యాలయం పరిధిలో 2, మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయంకు 5, వేములపల్లి తహసీల్దార్ 1, దామరచర్ల తహసీల్దార్ 1, మాడ్గులపల్లి తహసీల్దార్ 1, త్రిపురారం తహసీల్దార్ 1, తీర్మలగిరి సాగర్ తహసీల్దార్ 2, డివిజనల్ పంచాయతీ అధికారి 1, మిర్యాలగూడ మున్సిపాలిటీ 2, సబ్ డివిజనల్ పోలీస్ 1, తహసీల్దార్ పెద్దవుర 1, సిడిపిఓ దామరచర్ల 1, ఆర్టీసీ డిపో మేనేజర్ మిర్యాలగూడ 1 ఫిర్యాదులు స్వీకరించారు.
అధికారులకు సూచనలు
అందిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారం చేయాలని ఆర్డిఓ ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి రాఘవరావు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.జగదీశ్వర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి నసీమా మెహ్రిన్, ఎక్సైజ్ ఎస్ఐ షేక్ పర్వీన్, ఐసిడిఎస్ దామరచర్ల ప్రాజెక్టు ఆఫీసర్ శాంతి, మునిసిపల్ రెవిన్యూ ఆఫీసర్ ఆర్.కళ్యాణి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్, ఆదినారాయణ, గ్రామీణ పేదరిక నిర్ములన కార్యక్రమం ఎపిడి బాలకృష్ణ, ఐసిడిఎస్ సీనియర్ అసిస్టెంట్ రాములు, నీటిపారుదల శాఖ డిఇఇలు ఎండి.అహ్మదుల్లా, జనార్దన్, బిక్షం, మిర్యాలగూడ డిప్యూటీ తహసీల్దార్ సైదిరెడ్డి, ఆర్ అండ్ బి ఎఇ సతీష్, విద్యుత్ సబ్ ఇంజనీర్ నవిన్, హెచ్ డబ్ల్యూఓ జానిమియా, ఎస్టీ వెల్ఫేర్ రమేష్, బిసి వెల్ఫేర్ రాకేష్ పాల్గొన్నారు.












