భైంసా/నిర్మల్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 26
నిర్మల్ జిల్లాలోని భైంసా, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, తానూర్ పట్టణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
నిర్మల్ జిల్లాలోని భైంసా, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, తానూర్ పట్టణాలతో పాటు వివిధ ప్రాంతాల్లో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా ముగిశాయి. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ప్రత్యేక నిఘా
ప్రజల రాకపోకలు, ప్రార్థనా మందిరాలు, ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ నియంత్రణ
ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్, రూట్ మొబైల్ బృందాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఎస్పీ అభినందన
వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలు, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, నిర్వాహకులను ఎస్పీ డా. జి. జానకి షర్మిల అభినందించారు.
సోదరభావానికి పిలుపు
జిల్లాలో అన్ని పండుగలను శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణానికి సహకరించాలని ఆమె కోరారు.


