బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
బోథ్ మండలంలోని కుచలాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మైలి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

స్వాతంత్ర సమరయోధుల స్మరణ
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సర్పంచ్ మైలి నారాయణ మాట్లాడుతూ, స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం వారికి కలిగిందని, వారి ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిగ్గుల అరుణ్ రెడ్డి, వార్డు సభ్యులు నని గంటి లక్ష్మారెడ్డి, భోజన్న, అశోక్, మచ్చర్ల లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్ కళావతి, వీవో లీడర్ సీరం విజయ, గ్రామస్తులు సోమ చిన్న భోజరెడ్డి, నిమ్మల పోతరెడ్డి, చిలుకూరి నారాయణరెడ్డి, కొమ్ము శ్యాంసుందర్, సురుగుల భోజ రెడ్డి, నిమ్మల వినోద్, చిలుకూరి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.