ఖానాపూర్, 1 August
ఖానాపూర్ మండలం సింగాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆల్గుల లత, పంచాయతీ కార్యదర్శి గుడిసె లావణ్య ఆధ్వర్యంలో మహిళా సభ జరిగింది. ఈ సభలో గతంలో తీసుకున్న తీర్మానాల అమలు పురోగతిని సమీక్షించారు. మహిళల ఆరోగ్యం, భద్రత, సంక్షేమ పథకాలు, విద్య, గ్రామాభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.
ఖానాపూర్ మండలం సింగాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆల్గుల లత, పంచాయతి కార్యదర్శి గుడిసె లావణ్య ఆధ్వర్యంలో మహిళా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గత మహిళా సభలో తీసుకున్న తీర్మానాల అమలు స్థితిపై సమీక్ష జరిపారు.
మహిళల ఆరోగ్యం, పోషకాహారం, పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై అవగాహన కల్పించి, చర్చించారు. మహిళల భద్రత, చట్టపరమైన హక్కులపై కూడా అవగాహన కల్పించారు.
స్వయం సహాయక సంఘాల (SHGs) అభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హుల ఎంపికపై కూడా చర్చ జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆహార భద్రత కార్డులు, ఇతర సంక్షేమ పథకాలపై సమస్యలు, సూచనలు స్వీకరించారు.
గ్రామంలోని విద్య, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, బాలికల విద్యపై చర్చించారు. మహిళలు, బాలికలపై జరిగే హింస నివారణ, ఫిర్యాదు వ్యవస్థలపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చించి, తీర్మానాలు ఆమోదించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆల్గుల లత, ఉప సర్పంచ్ అర్జున్, పంచాయతీ కార్యదర్శి గుడిసె లావణ్య, వార్డు సభ్యులు రూప్ల, సుజాత, కొమురేశ్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, ఆశ వర్కర్ లావణ్య, ఎఫ్ ఏ రవీందర్, రామకృష్ణ, హైదర్, శంకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












