హైదరాబాద్, 2026-08-21
భూపాలపల్లి జిల్లాలో దళిత (మాదిగ) జర్నలిస్ట్ పుల్ల రవీందర్ ఇంట్లోకి చొరబడి ఆయనపై తీవ్రంగా దాడి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భూ కబ్జాల విషయంలో పుల్ల రవీందర్ వార్తలు రాస్తే అక్రమార్కులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. సరైన వైద్యం కూడా అందించకుండా నిర్లక్ష్యం చేయటం, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దోషులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.
రక్షణ చట్టం ఆవశ్యకత
జర్నలిస్టులపై జరిగే దాడుల నివారణకు జర్నలిస్టుల రక్షణ చట్టం లేకపోవడమే ప్రధాన కారణమని బూర్గుల నాగేందర్ మాదిగ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పుల్ల రవీందర్ కు పూర్తిస్థాయిలో వైద్యం అందించడంతోపాటు వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
దళిత జర్నలిస్టులపై దాడులు
దేశవ్యాప్తంగా దళిత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, హత్యలు రోజురోజుకు తీవ్రమైపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొల్లె రాజేష్, సుక్క అశోక్, సుంచు లింగయ్య, రాయుడు తదితరులు పాల్గొన్నారు.