ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, సమతా సైనిక్ దళ్ సైనిక్ హేమ్లే ప్రసంజీత్కు సామాజిక సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ లభించింది. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు “డాక్టర్ ఆఫ్ సోషల్ వర్క్” డిగ్రీ పట్టా ప్రదానం చేశారు.
ఇంటర్నేషనల్ లూసియానా రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పూణేలోని ఆలంది దేవాచి పరివార్ బ్యాంక్వెట్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బౌద్ధ ధమ్మ ప్రచారం, విపశ్యన, బాలల విద్య ప్రోత్సాహం, చెడు వ్యసనాల నివారణ, లైఫ్ ఇన్సూరెన్స్ అవగాహన, సామాజిక మరియు విద్యారంగాల్లో ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ గౌరవం లభించింది.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ అన్ను కృష్ణ, రిటైర్డ్ కలెక్టర్ డా. సాంబ మోతీరామ్ సర్కుండే, రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ డా. సుమిత్ సేన్, రిటైర్డ్ కోర్టు జడ్జి శివదాస్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా హేమ్లే ప్రసంజీత్ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రసంజీత్ మాట్లాడుతూ, ఈ గౌరవం తన సేవలకు మరింత ప్రేరణగా నిలుస్తుందని, సమాజ చైతన్యం కోసం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం, ఏకపాత్రాభినయం, నాటికలు కూడా నిర్వహించారు.










