నల్గొండ జిల్లా డీసీసీ కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ చిన్ననాటి స్నేహితులు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణను చింతపల్లిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ తన స్నేహితుల ఆత్మీయతను కొనియాడారు.
మిర్యాలగూడలో జరిగిన ఈ కార్యక్రమంలో, చైర్మన్ సుధా బాలకృష్ణ మాట్లాడుతూ, తన భర్త స్నేహితులు చూపిన ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. స్నేహం ఒక పవిత్రమైన బంధమని, బాల్య స్నేహం కల్మషం లేని అనుబంధమని ఆమె అభివర్ణించారు.
తన భర్తతో స్నేహితుల బంధం ఎంత దృఢంగా ఉందో, ఈరోజు వారు చూపిన ఆదరణ ద్వారా అర్థమైందని, తనను ఒక కుటుంబ సభ్యురాలిగా భావించి గౌరవించడం మరింత ఆనందాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు.
ప్రజలకు మరింత సేవ చేయాలనే తన ఉత్సాహాన్ని ఈ ప్రోత్సాహం పెంచుతుందని, మున్సిపల్ చైర్మన్గా తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తించడానికి అందరి ఆశీస్సులు కోరుకుంటున్నానని చైర్మన్ సుధా బాలకృష్ణ తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మిర్యాలగూడ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు చాంద్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ ఆజమ్ ఖాన్, షరీఫ్ భాయ్, బలరాం, రమేష్, ఏజాస్, బక్కయ్య, మండేలా శ్రీను, పుప్పాల శ్రీను, మహేశ్, మస్తాన్, ఇక్బాల్, తస్లీమ్, ఖాసీం, వాసు (డాడ్), గోగినేని వెంకట్, సూర్య నారాయణ, జానీ పాషా, కె. ప్రభాకర్, కూనల కృష్ణ, మల్లి (మల్లికార్జున్), సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.








