మిర్యాలగూడ, 2026-08-06
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్ గుంటూరు చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు గురువారం పట్టణంలోని రా రా కేఫ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) హాజరై, చంద్రశేఖర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్ గుంటూరు చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు గురువారం పట్టణంలోని రా రా కేఫ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) వేడుకలలో హాజరై కేక్ కట్ చేయించి, స్వీట్ తినిపించి చంద్రశేఖర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, గుడిపాటి నవీన్, చక్క రాజేందర్, కీర్తి రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్ట్ నర్ రేపాల అంతయ్య, తల్లం అశోక్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోల సైదులు ముదిరాజ్, ఉపాధ్యాయ సంఘ నేత గుడిపాటి కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు
కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫారూఖ్, బూడిద సైదులు, అబ్దుల్లా, న్యాయవాది తెడ్ల కిరణ్, వన్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడి రెక్క ఇంద్ర కుమార్, టూ టౌన్ అధ్యక్షులు మోయిజ్, రైస్ మిల్ ప్రతినిధులు గుంటూరు జనార్ధన్, గుంటూరు రామ్మోహన్, యోగ సభ్యులు చీదెళ్ల వెంకటేష్, పోలిశెట్టి నాగేశ్వరరావు, జైయిని రవికుమార్, గిరి, గౌరు శేఖర్, రవి శ్రీను, రజినీకాంత్, చక్క కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












