కోహెడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గుగ్గిళ్ల కార్తీక్ తాతగారు, గడ్డమీది పెద్ద నర్సయ్య ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి గురువారం పరామర్శించారు.

నివాళులర్పించిన వంశీధర్ రెడ్డి
ఈ సందర్భంగా మృతుని చిత్రపటానికి గవ్వ వంశీధర్ రెడ్డి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గడ్డమీది పెద్ద నర్సయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
పరామర్శలో పాల్గొన్నవారు
ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామస్తులు బెజ్జంకి రాజు, గట్టేపల్లి దీపక్, జాలిగాం బన్నీతో పాటు మృతుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.