భైంసా, 25 July
ఆదివాసి ఆత్మగౌరవానికి, గురుభక్తికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన వీర ఏకలవ్యుని జయంతి వేడుకలను ఎరుకల సంఘం ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు హాజరై ఏకలవ్యునికి నివాళులర్పించారు.
ఆదివాసి ఆత్మగౌరవానికి, గురుభక్తికి, పట్టుదలకు ప్రతీక అయిన వీర ఏకలవ్య జయంతి వేడుకలను ఎరుకల సంఘం ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భైంసా పట్టణ మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి గారు, వివిధ వార్డుల కౌన్సిలర్లు చెర్ల సుభాష్, తాలోడ్ శ్రీనివాస్, పుర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ, ఏకలవ్యుడు గురువు లేకుండానే తన కృషితో విలువిద్యలో సాధించిన తీరు నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సంఘ సభ్యులు, పెద్దలు, యువకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. చివరగా అందరికీ ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.












