ఇచ్చోడ, 2026-08-22
ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండలం బొరిగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంధే శ్రీనివాసరెడ్డి తాత డేర గంగారెడ్డి ఈ నెల 19న మృతి చెందారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సాయంత్రం బొరిగాం గ్రామానికి వెళ్లి డేర గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు అయిర నారాయణరెడ్డి, రమణారెడ్డి, పాకాల రామచంద్రు తదితరులు ఉన్నారు.