యాదాద్రి భువనగిరి, 20 July
రాక్షసుల చేతుల్లో నలిగిన బాల్యాలు, చెదిరిన స్వప్నాలు, పూడిపోయిన ఆశలు, రోదించే మానవ బాల్యాలపై మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి తన ఆవేదనను వ్యక్తం చేశారు. బాల్యం వికసించకముందే వాడిపోతుందని, రాక్షసుల స్పర్శలో పవిత్రత రాలిపోతుందని ఆమె పేర్కొన్నారు.
రాక్షసుల చేతుల్లో నలిగిన బాల్యాలు, చిన్నారి కళ్లలో చెదిరిన స్వప్నాల జాల్యాలు, పుట్టకముందే పూడిపోయిన ఆశల గాల్యాలు, నిశ్శబ్ద రాత్రుల్లో రోదించే మానవ బాల్యాలు. బాల్యం అనే పువ్వులు వికసించకముందే వాడిపోతున్నాయని, రాక్షసుల స్పర్శలో పవిత్రత అంతా రాలిపోతుందని, నిర్దయ నేలపై కన్నీటి బిందువులు నిలిచిపోతున్నాయని, మనసుల గాయాల్లో కాలం నిశ్శబ్దంగా నిలిచిపోయిందని మంజుల పత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.
మృగాలు సైతం తలదించుకునే నీచత్వం మనిషిలోనే కనిపిస్తుందని, చట్టపు నీడలో దాగి దోషి నిర్భయంగా నడుస్తున్నాడని, న్యాయం గదుల్లో ధనం కనిపించని గాలిలా ప్రవహించి సత్యం మూగబోయి మౌనంలో కరిగిపోతుందని ఆమె పేర్కొన్నారు. ఆలయ గోడలపై ధర్మం అక్షరాలుగా నిలిచినప్పటికీ, బడి గడపలపై నీతి సూక్తులు వెలిగినప్పటికీ, లోపల న్యాయం ధన ప్రవాహంలో కొట్టుకుపోతుందని, సమాజం మాత్రం మౌన సాక్షిగా నిలిచిపోతుందని అన్నారు.
తల్లిదండ్రుల నిర్లక్ష్యంలో యువత మార్గం తప్పి, అజ్ఞానం ముసుగులో బాధ్యతల భారం మసకబారుతుందని, చరిత్ర రాయబోయే నాయకులే చీకటిలో మునిగిపోతున్నారని, మానవత్వం మౌనంగా కాలగర్భంలో కరిగిపోతుందని ఆమె విచారం వ్యక్తం చేశారు.
ఈ రచన మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటిది. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆమె చరవాణి 9347042218.












