భైంసా, జులై 15
భైంసటటణంిస(ఎసఐఆ)ఫుూతిచేసేందుుసథియువుుసవచఛందంఒతయేసేవశిబిిటుచేశు.ఓటుజబితతయేసవణియభంిషసయుు,వృదధుుఎదుొంటుఇబబందుుదృషటిఉంచుుిఈయమంచేటటు.
భైంసా పట్టణంలోని ఏపీ నగర్ కాలనీలో సర్ (ఎస్ఐఆర్) ఫారాలు పూర్తి చేసేందుకు ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా సర్ ఫారాలు పూరించడంలో నిరక్షరాస్యులు, వృద్ధులు, ఇతర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్థానిక యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
శిబిరంలో ప్రజలకు ఫారాలు నింపడం, అవసరమైన వివరాలను నమోదు చేయడం, పత్రాలను పరిశీలించడం, దరఖాస్తుల పూర్తి ప్రక్రియపై అవగాహన కల్పించడం వంటి సేవలను అందించారు. దీంతో కాలనీవాసులు సులభంగా తమ సర్ ఫారాలను పూర్తి చేసుకునే అవకాశం లభించిందని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలు గడువు ముగిసేలోపు తమ సర్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకుని శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతపండు మహేష్, ఆర్ఎంపీ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్, మాధవరావు పటేల్, కాస మహేష్, లంక గంగాధర్, స్థానిక యువకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.












