మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
మామడ మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జాదవ్ కళ్యాణి సచిన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రతి ఇంటికి నాలుగు చొప్పున చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
మామడ మండలంలోని బండల ఖానాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జాదవ్ కళ్యాణి సచిన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రతి ఇంటికి నాలుగు చొప్పున చెత్త బుట్టలను పంపిణీ చేశారు.
ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక
గ్రామం జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ నమూనాగా ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సహకరించాలని సర్పంచ్ జాదవ్ కళ్యాణి సచిన్ కోరారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ కళ్యాణి సచిన్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి అక్షిత, మండల పంచాయతీ అధికారి హరికృష్ణ, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












