మిర్యాలగూడ, జూన్ 28
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లికి చెందిన బాల్య మిత్రులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన ఇస్లావత్ రవికుమార్ కుటుంబానికి రూ. 62,000 ఆర్థిక సహాయం అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని వారు పేర్కొన్నారు.
మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన బాల్య మిత్రుల బృందం మానవత్వాన్ని చాటుకుంది. ఇటీవల మృతి చెందిన ఇస్లావత్ రవి కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సమావేశమైన మిత్రులు, అనంతరం రవి కుమార్ స్వగ్రామమైన కాల్వపల్లికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి మనోధైర్యం కల్పించి, మిత్రుల సహకారంతో రూ. 62,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని బాల్య మిత్రుల బృందం సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, రామ్ కుమార్, సురేష్ శ్రీను, సమ్మయ్య, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.












