నిజామాబాద్, 1 August
నిజామాబాద్ నగరంలో సామాజిక విప్లవకారుడు, రచయిత అన్నా బావు సాఠే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరి ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలనీలో గల అన్నా బావు సాఠే విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరి విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. ఈ జయంతి ఉత్సవాల్లో పి.ఆర్.టి.యు. తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ, అన్నా బావు సాఠే ఒక సామాజిక విప్లవకారుడని, ప్రముఖ రచయిత అని కొనియాడారు. ఆయన సమాజంలో కుల వివక్షను రూపుమాపడానికి, శ్రామిక వర్గాల హక్కులను కాపాడటానికి కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారా ప్రతి ఒక్కరూ సాధికారత సాధిస్తారని సందేశం ఇచ్చిన గొప్ప విప్లవకారుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథులుగా భక్తవత్సలం, ఢిల్లీ, మురళి తదితరులు పాల్గొన్నారు.












